Header Banner

పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..! లేటెస్ట్‌ రేట్లు ఇవే..!

  Tue May 27, 2025 11:51        Business

నెల రోజుల క్రితం బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటింది. అయితే చూస్తుండ‌గానే బంగారం ధ‌ర‌లు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి.. లక్ష దాటిన తర్వాత స్వచ్ఛమైన బంగారం ధర 95 వేల వరకు వచ్చింది.. ఆ తర్వాత ఇటీవల మళ్లీ ధరలు పెరుగుతూ వస్తున్నాయి.. తాజాగా మళ్లీ బంగారం ధర 99వేలకు చేరువైంది.. మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై రూ.490 మేర ధర పెరిగింది..

దేశీయంగా ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.490 మేర పెరిగి.. రూ.98,130గా ఉంది.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.450 మేర ధర పెరిగి.. రూ.89,950 గా ఉంది..

మంగళవారం ఉదయం బులియన్ మార్కెట్ ప్రకారం.. ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

హైదరాబాద్‌ 24 క్యారెట్ల బంగారం ధర రూ.98వేల 130 రూపాయిలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.89వేల 950 రూపాయిలుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.1,11000లుగా ఉంది.


విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,130గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 89,950లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,11,000 లుగా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,280గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,100లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,00,000లుగా ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.98,130, 22 క్యారెట్ల ధర రూ.89,950 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,00,000లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.98,130, 22 క్యారెట్ల ధర రూ.89,950 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,11,100లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్లు రూ.98,130, 22 క్యారెట్లు రూ.89,950 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,00,000లుగా ఉంది.

పుంజుకుంటున్న బులియన్ మార్కెట్..

ప్రపంచ అనిశ్చితులు, బలహీనమైన డాలర్ మధ్య జూన్ ఫ్యూచర్స్ MCXలో పెరగడంతో బంగారం ధరలు ఇటీవలి కనిష్ట స్థాయిల నుండి వేగంగా పుంజుకున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. రాబోయే US ఆర్థిక డేటా కారణంగా ప్రేరేపించబడిన సురక్షితమైన కొనుగోళ్లు ఈ లాభాలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వారం బంగారం, వెండి అస్థిరంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ లో మరింత పుంజుకునే అవకాశం కూడా ఉందని చెబుతన్నారు.

ఇది కూడా చదవండి: ఏపీ పోలీసు బాస్‌గా అయన నియమకం! ఇక పూర్తిస్థాయి డీజీపీ!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!


ప్రపంచంలో టాప్-10 వైమానిక దళాలు ఇవే! భారత్ స్థానం ఎక్కడంటే?


కేసీఆర్ కు కవితకు మధ్య గ్యాప్ వెనుక కారణం ఇదే! చేసింది అంతా ఆయనే!


ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీ.. చేసిన తీర్మానాలు ఇవే!


జంట హత్యల కేసులో ఊహించని ట్విస్ట్.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రదర్స్ పై కేసు నమోదు!


రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి పీఎస్ఆర్‌, మధు! ఆంజనేయులపై ప్రశ్నల వర్షం..


ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమం!


వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు.. ఆస్తి అడిగామా?
నిరూపించండి.. మనోజ్ ఎమోషనల్!


నిరుద్యోగులకు గుడ్ న్యూస్! నెలకు 2 లక్షల జీతంతో.. భారీ నోటిఫికేషన్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #GoldPriceHike #GoldRatesToday #GoldLoversShock #GoldPriceUpdate #BullionMarket #GoldTrend